Download Free Audio of కాలనీల అభివృద్ధి క... - Woord

Read Aloud the Text Content

This audio was created by Woord's Text to Speech service by content creators from all around the world.


Text Content or SSML code:

కాలనీల అభివృద్ధి కోసమే పట్టణ ప్రగతి.. పట్టణ ప్రగతిలో ప్రజలు భాగస్వాములు కావాలి...* *జీడిమెట్ల డివిజన్ పరిధిలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పర్యటన...* కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జీడిమెట్ల 132 డివిజన్ పరిధిలోని భూమిరెడ్డి కాలనీలో పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు మరియు స్థానిక కార్పొరేటర్ చెరుకుపల్లి తారా చంద్రారెడ్డి గారు పర్యటించారు. ఈ మేరకు పాదయాత్ర చేసి స్థానిక సమస్యలు తెలుసుకున్నారు. కాగా మిగిలిన 100 మీటర్లు రోడ్డు, డ్రైనేజీ మాన్ హోల్స్ ప్లాస్ట్రింగ్, విద్యుత్ స్తంభాలు, రోడ్డు నెంబర్ 3,4లలో మిగిలిన వాటర్ లైన్స్ వంటి సమస్యలు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురాగా.. అక్కడే ఉన్న అధికారులకు వాటి పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పట్టణ ప్రగతిలో ప్రజలు తనకు తెలియజేసిన సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ వహించి పూర్తి చేయాలన్నారు. గతంలో అస్తవ్యస్థంగా ఉన్న డ్రైనేజీ, రోడ్లను నిధులకు కొరత లేకుండా అభివృద్ధి పర్చామన్నారు. ప్రతీ కాలనీలో మెరుగైన సేవలు అందించడమే తన ధ్యేయం అన్నారు. ఈ కార్యక్రమంలో ఈఈ కృష్ణ చైతన్య, ఏఈ సురేందర్ నాయక్, కాలనీ అడ్వైజర్ పెద్ది మల్లేశం, చీఫ్ అడ్వైజర్లు బల్వంత్ రెడ్డి, నర్సింహా రెడ్డి, ప్రెసిడెంట్ భూపాల్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్లు శ్రీనివాస్, సంతోషి, జనరల్ సెక్రెటరీ రవికుమార్, జాయింట్ సెక్రటరీ రవీందర్ గౌడ్, కల్చరల్ సెక్రెటరీ సాంబి రెడ్డి, లక్ష్మణ చారి, ట్రెజరర్ సత్తి రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీలు శేకర్, రఫీ, శ్రీనివాస్, సదా లక్ష్మీ, స్రవంతి, అశోక్ చారి, సాయి కుమార్, లలిత, సులోచన, రమేష్ తదితరులు పాల్గొన్నారు.